© 2012 చిన్ని ఆశ, All Rights Reserved. Powered by Blogger.
RSS

"చిన్ని ఆశ" కు జన్మదిన శుభాకాంక్షలు!

© 2012 చిన్ని ఆశ, All Rights Reserved

"బుడి బుడి అడుగులతో
బ్లాగు లోకంలో అడుగుడి
నేటికి సరిగ్గా '2' సంవత్సరాలు!


మా రాతల్నీ గీతల్నీ
అభిమానిస్తూ, ప్రోత్సహిస్తున్న అందరికీ
వందనాలు!
"

-మీ చిట్టిపండు
....

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

26 comments:

శ్రీ said... Best Blogger Tips[Reply to comment]Best Blogger Templates

'చిన్ని ఆశ' కవితల పందిరికి రెండేళ్ళు....
'చిన్ని ఆశ' చక్కని చిత్రాలకు రెండేళ్ళు...
'చిన్ని ఆశ' స్నేహపూర్వకమైన స్పందనలకు రెండేళ్ళు...
'చిన్ని ఆశ' వ్రాస్తూ ఉండాలి నూరేళ్ళు...
అభినందలు చిన్ని ఆశ గారూ!
@శ్రీ

మాలా కుమార్ said... Best Blogger Tips[Reply to comment]Best Blogger Templates

Happy Birthday , chinniaasa.

chinni v said... Best Blogger Tips[Reply to comment]Best Blogger Templates

మీ భావుకత తో మా అందర్నీ అలరిస్తూ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని కాంక్షిస్తూ
చిన్ని

జలతారువెన్నెల said... Best Blogger Tips[Reply to comment]Best Blogger Templates

Congratulations!! I wish you many more years of blogging.

శ్రీలలిత said... Best Blogger Tips[Reply to comment]Best Blogger Templates

HAPPY BIRTHDAY..

రాజి said... Best Blogger Tips[Reply to comment]Best Blogger Templates

'చిన్ని ఆశ' కు పుట్టినరోజు శుభాకాంక్షలు..
మీ రాతలు,గీతలతో ఎప్పుడూ ఇలాగే అందరినీ అలరించాలని కోరుకుంటున్నాము..

the tree said... Best Blogger Tips[Reply to comment]Best Blogger Templates

happy birthday to chinni aasha blog.

Padmarpita said... Best Blogger Tips[Reply to comment]Best Blogger Templates

Many more happy returns of the day...:-)

Palla Kondala Rao said... Best Blogger Tips[Reply to comment]Best Blogger Templates

Congratulations To chinniaasa.blogspot.in.

యాదృచ్చికమే అయినా నా పుట్టిన రోజే " చిన్ని ఆశ " పుట్టిన రోజు కావడం విశేషం.

మరిన్ని మంచి పోస్టులు వ్రాయాలని ఆశిస్తూ మరోసారి చిన్నిఆశ కు జన్మదిన శుభాకాంక్షలు.

జ్యోతిర్మయి said... Best Blogger Tips[Reply to comment]Best Blogger Templates

బుడి బుడి నడకలతో
బ్లాగులోకంలోకి అడుగిడి

అందమైన బొమ్మలు,
హృద్యమైన కవితలతో
మది నలరించిన 'చిన్ని ఆశ'కు
హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు!

రసజ్ఞ said... Best Blogger Tips[Reply to comment]Best Blogger Templates

చిట్టీ పండులాగా మీ రాతలూ గీతలూ జంటగా ఉంటేనే చూడముచ్చటగా ఉంటుందండీ!
"చిన్ని ఆశ" అంటూనే ఎంతో మంది అభిమానులని సంపాదించుకున్న మీ ఇద్దరికీ హార్థిక జన్మదిన శుభాకాంక్షలు!
ఇలాంటి మరెన్నో పుట్టినరోజులు దాటుకుంటూ చాకిలేటుల బదులు మీరు వేసే చిత్రాలను పంచిపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను...

kastephale said... Best Blogger Tips[Reply to comment]Best Blogger Templates

దీర్ఘాయుష్మాన్భవ.

anrd said... Best Blogger Tips[Reply to comment]Best Blogger Templates

చిన్ని ఆశకు .... జన్మదిన శుభాకాంక్షలు.
మీరు మరెన్నో చక్కటి టపాలను అందించాలని కోరుకుంటున్నానండి.

Meraj Fathima said... Best Blogger Tips[Reply to comment]Best Blogger Templates

చిన్ని ఆశ గారూ, ఆలస్యానికి మన్నించాలి, నేను మీ ఆగమనం గుర్తించలేదు.
చిన్ని ఆశ జన్మదినం ఇలాగే నిండు నూరేళ్ళు జరుపుకోవాలి.
మీ చిత్రలేఖనం చాలు మిమ్ము చిరకాలం నిత్య నూతనంగా ఉంచుతుంది.
ఓ ఆర్టిస్ట్ గా మీరు ఎప్పుడూ గొప్పవారే. వెంట వెంటనే పోస్ట్స్ పెట్టేయండి.....మెరాజ్

Sri Valli said... Best Blogger Tips[Reply to comment]Best Blogger Templates

Happy Birthday and Congrats :]

చిన్ని ఆశ said... Best Blogger Tips[Reply to comment]Best Blogger Templates

@శ్రీ గారూ,
ఎంతో స్నేహపూర్వకమైన మీ అభినందనలకి బోలెడు ధన్యవాదాలండీ!

@మాలా కుమార్ గారూ,
ధన్యవాదాలండీ!

@chinni v గారూ,
మా భావుకతని చదివి, ప్రోత్సహిస్తున్న మీకూ ధన్యవాదాలండీ!

చిన్ని ఆశ said... Best Blogger Tips[Reply to comment]Best Blogger Templates

@జలతారువెన్నెల గారూ,
Thank you so much అండీ!

@శ్రీలలిత గారూ,
Thanks a lot!

@రాజి గారూ,
మా రాతలు, గీతలూ మిమ్మల్ని అలరించాయంటే చాలా సంతోషం, మీ అభినందనలకి ధన్యవాదాలు!

చిన్ని ఆశ said... Best Blogger Tips[Reply to comment]Best Blogger Templates

@the tree గారూ,
Thanks for your wishes అండీ!

@Padmarpita గారూ,
Many many thanks అండీ!

@Palla Kondala Rao గారూ,
హ హా! నిజమా...మా భావాలనీ, మా "చిన్ని ఆశ" నూ అభిమానించే మీ పుట్టినరోజు నాడే మా "చిన్ని ఆశ" పుట్టిన రోజు కావటం మాకెంతో సంతోషం.
బోలెడు ధన్యవాదాలండీ! మీ అభినందనలు మాకెపుడూ ఆనందదాయకమే!

చిన్ని ఆశ said... Best Blogger Tips[Reply to comment]Best Blogger Templates

@జ్యోతిర్మయి గారూ,
మా "చిన్ని ఆశ" మీ మదినలరించింది అంటే మాకంతకన్నా సంతోషమా!
మీకూ మా హృదయపూర్వక ధన్యవాదాలు!

@రసజ్ఞ గారూ,
హ హా, పుట్టినరోజు నాడు చాకిలేటుల బదులు చిత్రాలు కావాలని అడిగే మీ కళా హృదయానికి బోలెడు ధన్యవాదాలు!
చాకిలేటు లు నోటిని తీపి చేస్తే, చిత్రాలు రసజ్ఞుల మదిని తీపి చేస్తాయి, కదూ!
లేటు అయినా చాకిలేటు ల బదులు మీకు తప్పక చిత్రాలు మనస్ఫూర్తిగా వేసి ఇస్తాము.

@kastephale గారూ,
మీలాంటి వారి ఆశీస్సులే మా "చిన్ని ఆశ" కు బోలెడు బలం, చాలా ధన్యవాదాలండీ!

చిన్ని ఆశ said... Best Blogger Tips[Reply to comment]Best Blogger Templates

@anrd గారూ,
తప్పకుండానండీ!
మీ ప్రోత్సాహానికి బోలెడు ధన్యవాదాలు!

@Meraj Fathima గారూ,
ఆశీస్సులకి, అభినందనలకీ ఆలశ్యం ఎన్నడూ ఉండదండీ!
మీ అభిమానానికీ, అభినందనలకీ చాలా ధన్యవాదాలు.
మా చిత్రలేఖనాన్ని మీరెంతగానో ప్రోత్సహిస్తున్నారు, చాలా స్ఫూర్తి దాయకం మాకు మీ ప్రతి స్పందనా.
హ హా...ఆర్టిస్ట్ కన్నా ఆర్ట్ ఎప్పుడూ గొప్పదేకదండీ! ఆ ఆర్ట్ ని గుర్తించే మీలాంటి ప్రతి వారూ గొప్పవారే!

@Sri Valli గారూ,
Thank you so much అండీ!

సుభ/subha said... Best Blogger Tips[Reply to comment]Best Blogger Templates

'చిన్ని ఆశ ' పుట్టిన రోజా? చాలా ఆలస్యంగా చూసానండీ.ముందుగా ఆలశ్యంగా చిన్ని ఆశకి హృదయపూర్వక జన్మదిన 'సుభా'కాంక్షలు పండు గారూ..
ఇలాగే మీరు గీసే చిత్రాలతో నేను పడుతూ లేస్తూ ఉండాలని,వీలైనంతగా నన్ను ఇంకా ఇంకా పడేస్తారనీ ఏదో చిన్ని ఆశ.నా కోరికని మన్నిస్తారు కదూ??:):):) లేకపోతే ఏం చేస్తారులెండి? నేను మరీ చోద్యం కాకపోతే.. కదండీ?(సరదాకేనండోయ్)మర్చిపోయాను మీ చిట్టికి కూడా చెప్పండి నా శుభాకాంక్షలు. తనని మర్చిపోయానని బొమ్మలెయ్యొద్దని చెప్పినా చెప్తుంది.అసలే రసజ్ఞ గారి మళ్ళీ పుట్టినరోజుకి మీరేమో బొమ్మ,నేనేమో వేడుక చేస్తానని కమిట్ అయ్యామాయే.మాకు ఇంత రిస్క్ తీస్కోవడం అవసరమా చెప్పండి..కాబట్టి మీ చిట్టికి మరీ మరీ చెప్పండి..

ఆ కుంచె కవ్వమై చిలుకుతుంటే
ఎన్నెన్నో వన్నెలు జనిస్తాయి.,
ఆ వన్నెలన్నీ వెన్నెల్లో జలకమాడి
అతని చేతుల్లో ఒదిగిపోవాలని
వడివడిగా పరుగులు తీస్తాయి.,
ఆమె మదిలోని భావం
అతని ఆర్తిగా మారి
ఎన్నో వర్ణాల వివరాలై
చిక్కని చీకటిలో సైతం
వింత మెరుపులు చిందే
హరివిల్లుల చిత్తరువై పోతుంది..,
అది చూస్తున్న మనసులో ఓ మూగ బాస
ఇంకా చూడాలనే ఏదో చిన్ని ఆశ..!





Lasya Ramakrishna said... Best Blogger Tips[Reply to comment]Best Blogger Templates

Happy Birthday and Congrats :]

వెంకట రాజారావు . లక్కాకుల said... Best Blogger Tips[Reply to comment]Best Blogger Templates

కవితలకు - చిత్రకళలకు గని యనంగ
ఘనత దాల్చెను , రెండేళ్ళు గడచి పోయె ,
మోదమును గూర్చు నికముందు ముందు గూడ
'చిన్నిఆశ'కు నాదు ఆశీస్సు లివిగొ .
----- సుజన-సృజన

చిన్ని ఆశ said... Best Blogger Tips[Reply to comment]Best Blogger Templates

@సుభ/subha గారూ,
మీ హృదయపూర్వక "సుభా"కాంక్షలకు ముందుగా బోలెడు ధన్యవాదాలు!
ఆలశ్యం అయినా మా చిత్రాలనీ, భావాలనీ, వాటికి స్ఫూర్తినీ అన్నిటినీ కలిపి అందమైన పదాలుగా కూర్చి మీరల్లిన కవిత మాకెంతగానో నచ్చింది.
చిత్రాలను చూసి పడుతూ లేస్తూ ఉండటంలో మీరు వాటిని ఎంతగా ఆస్వాదిస్తున్నారో అర్ధం అయ్యింది, మీ కోరికను మన్నించి ;) మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ పడేస్తూ మరింత ఆస్వాదించేలా బొమ్మలు గీసే ప్రయత్నం మున్ముందు చేస్తూనే ఉంటాము.
గుర్తు పెట్టుకునె చిట్టికీ మీ "సుభా"కాంక్షలు చెప్పినందుకు ఇక మీకు చిట్టి బొమ్మలే బొమ్మలు ;)
హ హా...నిజమే మనం రసజ్ఞ గారికి కమిట్ అయ్యాం కదూ!
తెలుసుగా? ఒక్క సారి కమిట్ అయితే పండు తన మాట...(మీరే పూరించుకోండీ డైలాగ్ ఇక) ;)
మరో మారు బోలెడు ధన్యవాదాలు!

@Lasya Ramakrishna గారూ,
Thanks a lot అండీ!

@వెంకట రాజారావు . లక్కాకుల గారూ,
మీ కవితాశీస్సులకి కలిగెను మిక్కిలి సంతోషం
మీ ఆశీస్సులు మాకెపుడూ కొండంత బలం
బోలెడు ధన్యవాదాలతో మీకు మా ప్రణామం

మధురవాణి said... Best Blogger Tips[Reply to comment]Best Blogger Templates

అయ్యో.. నేను మీ బ్లాగు పుట్టినరోజు మిస్సయ్యానండీ.. చాలా చాలా ఆలస్యంగా చెప్తున్నాను. మీ 'చిన్నిఆశ' రెండేళ్ళు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంలో శుభాకాంక్షలు. వెన్నదొంగ బొమ్మ చాలా ముద్దుగా ఉంది. :)

చిన్ని ఆశ said... Best Blogger Tips[Reply to comment]Best Blogger Templates

@మధురవాణి గారూ,
ఆలశ్యం అయినా వచ్చి మీ శుభాకాంక్షలు అందించారు, చాలా సతోషం అండీ!
ముద్దొచ్చాడా మా చిన్ని కృష్ణుడు? త్వరగా ఎదిగిపోతున్నాడు :)
చాలా ధన్యవాదాలండీ!

Post a Comment