© చిన్ని ఆశ

మా వాడికి లెఖ్ఖల్లో వందకి వంద, మా టెండూల్కర్ వంద వందలు (చేశాక లెండి), మా సినిమా వందరోజుల విజయోత్సాహం, మాధిక్కారం [సంధి కలిపి పొందిగ్గా కాస్త కారం దట్టించాం...బాగు(ంటు)ందని. అదే 'మా అధి కారం' అని విడగొట్టి చదువుకోండి ;) ] వంద రోజులు గద్దెపై....ఇలా అందరూ వంద(అ)ని గర్వంగా సెలెబ్రేట్ చేసేసుకుంటుంటే బ్లాగ్ లోకంలో మనమూ మన వంద రచనలనీ గుర్తించి ఘనంగా చేసుకోవద్దూ మరి...

అప్పుడే వంద మాట(పా)ల మూటలు మా "చిన్ని ఆశ" లో రాశామా అనుకుంటే మాకే ఎంతో ఆశ్చర్యం వేసింది. అందుకే ఇలా ఈ స్పెషల్ పో(స్టర్) స్ట్ తో మీ అందరితోనూ సెలబ్రేట్ చేసుకుంటున్నాం.

చిన్ని గుండెల్లో ఆ "చిన్ని ఆశ" ఫలించేనా? అంటూ మా మొదటి పోస్ట్ రాసి ఇప్పటికి 516 రోజులు. ఈ 516 రోజుల్లో 101 పోస్ట్ లు. అంకెల్లో మా భావాలని కొలవాలని ప్రయత్నిస్తే  ప్రతి 5 రోజులకీ ఒక పోస్ట్, అందులో 25 పోస్ట్ లకి పదాల కూర్పుతో బాటు రంగు రంగుల గీతల చేర్పూ చేసే ప్రయత్నాలు. మా వందవ పోస్ట్ "చిత్రించా చెలీ" నా మనోఫలకం పై నిను శాశ్వతంగా... అంటూ పండు తన ప్రాణమైన చిట్టి ని మనసారా మాటల్లో, గీతల్లో, రంగుల్లో చిత్రించుకుంటూ చెప్పుకునే ప్రేమ భావం.

చిట్టి, పండు లాంటి ప్రేమ హృదయాలు ఎన్నో ఈ ఇలలో ఉంటాయి. నిత్యం ఆ ప్రేమ హృదయాలు ఎన్నెన్నో భావాలతో ఆలోచిస్తూనే ఉంటాయి. ఆ హృదయ భావాలు చెప్పకనే ఒకదానికొకటి చేరిపోతుంటాయి. ఆ గుండెలు ఆ భావాలకి స్పందిస్తూనే ఉంటాయి. ఒకదాని కోసం ఒకటి ఎప్పటికీ తపిస్తూనే ఉంటాయి. అలాంటి హృదయాల "చిన్ని ఆశలు" ఫలించాలి అన్న చిన్ని ఆలోచనకి మేమివ్వాలని చేస్తున్న ఈ చిన్ని ప్రయత్నమే మా "చిన్ని ఆశ".

"పండూ మనమూ మన భావాల్ని బ్లాగ్ రూపంలో రాయొచ్చుగా, అందరితోనూ పంచుకోవచ్చుగా..." అని 'చిట్టి' ముద్దుగా 'పండు' ని అడిగినపుడు, పండు అవును కదా అని, వెంటనే...మరి ఏం రాద్దాం...పేరేం పెడదాం...అన్నపుడు మా 'చిట్టి' చిన్ని బుర్రకి తట్టిన గొప్ప ఆలోచనే "చిన్ని ఆశ". అలా పుట్టిన మా ఈ "చిన్ని ఆశ" బ్లాగ్ లోకంలోకి బుడి బుడి నడకలతో ప్రవేశించింది. క్రమేపీ మా భావగీ(త)తికలకు మా 'చిట్టి' ప్రోత్సాహంతో ఉత్సాహంగా గీతవర్ణాల రూపమూ ఇవ్వటం మొదలెట్టాం. మా ప్రతి పోస్ట్ కీ స్పందిస్తూ మమ్మల్ని ఉత్సాహపరుస్తూ, తమ అభిప్రాయాలను మాతో పంచుకుంటూ ముందుకి నడిపిస్తున్న మా పాఠకులందరికీ, తోటి బ్లాగర్లకీ ఈ సందర్భంగా "ధన్యవాదాలు".

రెగ్యులర్ గా మా భావాలకి స్పందిస్తూ మాకెంతో ఉత్సాహాన్నిస్తున్న కల్లూరి శైలబాల గారు, రసజ్ఞ గారు, పల్లా కొండల రావు గారు, వేణూ శ్రీకాంత్ గారు, సుభ గారు, జిలేబి గారు, మధుర వాణి గారు,  శోభ గారు, జయ గారు, వల్లి గారు, చిన్ని గారు, పద్మార్పిత గారు, జ్యోతిర్మయి గారు,  వనజవనమాలి గారు, జ్యోతి గారు, మాలాకుమార్ గారు, లక్ష్మిరాఘవ గారు, ప్రవీణ గారు, నందు గారు,  Indian Minerva, నెలబాలుడు గారు, C.ఉమాదేవి గారు, మాధవ రావు పబ్బరాజు గారు, శశి కళ గారు, తెలుగు పాటలు, చెప్పాలంటే, బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ గారు, రాజి గారు, ఫణి గారు,  సందీప్ గారు...ఇలా పేరు పేరునా...ఎందరో...ఎందరెందరో. ఇందులో చాలా మంది ఇప్పటికే తమ భావాలతో, చిత్ర, పద కూర్పులతో బ్లాగ్ రీడర్లకి సుపరిచయం.

మా భావాలకీ, బొమ్మలకీ స్పందించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా మా "ప్రత్యేక ధన్యవాదాలు".

-మీ చిట్టిపండు
....

27 comments:

raf raafsun said...

మా భావాలకీ, బొమ్మలకీ స్పందించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా మా "ప్రత్యేక ధన్యవాదాలు".---------- its ok:):)

వేణూ శ్రీకాంత్ said...

సూపరండీ.. అభినందనలు :-)
మీ స్పెషల్ పో(స్టర్)స్ట్ చాలా బాగుంది అందులో చిట్టీపండుల బొమ్మకూడా చాలా బాగా గీశారు :-)

జ్యోతిర్మయి said...

అభినందనలండీ..మీ భావాలను మాతో పంచుకున్నందుకు..మీ బొమ్మలకు నేను గొప్ప అభిమానిని. కవితకు తగినట్టుగా అందమైన బొమ్మలు వేయడంలో మీకు మీరే సాటి. చిట్టి పండు సుఖసంతోషాలతో వెయ్యేళ్ళు వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను.

రసజ్ఞ said...

వంద టపాల ఆనంద హేలలొ అందుకొంది మా శుభాభినందనలు. ఇలానే మరెన్నొ జరుపుకొవాలని మనస్ఫూర్థిగా కొరుకుంటునాను. చక్కని బొమ్మలతొ వాటికి పొటీ పడే మాటల మూటలతొ మంచి టపాలను మ ముందుకి ఎన్నెన్నొ తీసుకురావాలని నా చిన్ని ఆశ.

padmarpita said...

చిట్టి+పండుకి100 పోస్ట్.....Congrats!

anrd said...

చిట్టి పండు ....మీకు శతాభినందనలు. ఇకముందు కూడా మీరు మరిన్ని పోస్టులతో అందరిని అలరించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

మాలా కుమార్ said...

100 టపాలు పూర్తిచేసుకున్నందుకు అభినందనలు .

మీ చిట్టి పండు బొమ్మ చాలా బాగుంది .

జయ said...

సెంచురీ కొట్టిన చిట్టి,పండు కు జేజేలు. మీ బొమ్మలు కావాలి. కవితలు కావాలి. మీ చిన్నీఅశలు బోలెడు కావాలి: థాంక్యూ.

చిన్ని said...

congrats!

మధురవాణి said...

చిట్టి పండులకి శతటపోత్సవ శుభాకాంక్షలు.
భలే అలవోగ్గా గీసేస్తారండీ మీరు మాత్రం బొమ్మలు. :)
మీరిలాగే చక్కటి రాతలూ గీతలతో వెయ్యి టపాలు పూర్తి చెయ్యాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా..

"చిన్ని ఆశ" said...

@ raf raafsun గారూ,
"చిన్ని ఆశ" కు స్వాగతం. మరీ మొహమాటపడిపోతున్నారు ;)

@ వేణూ శ్రీకాంత్ గారూ,
థ్యాంక్స్ అండీ. పోస్టూ, పోస్టరూ తోబాటు చిట్టీ, పండూ బొమ్మాలూ నచ్చినందుకు.

@ జ్యోతిర్మయి గారూ,
ధన్యవాదాలండీ! మా బొమ్మలకి అభిమానులూ ఉన్నరని ఇప్పుడే తెలిసింది, ఇంకా బాగా గీసే స్ఫూర్తిని ఇచ్చారు. మనసారా మీ కోరికకీ చాలా ధన్యవాదాలు...

@ రసజ్ఞ గారూ,
ధన్యవాదాలు, మీ అభినందనలే స్ఫూర్తిగా మరిన్ని చక్కని టపాలతో మీముందుకి వచ్చే ప్రయత్నం తప్పక చేస్తాము. మీ అభిమానానికి మళ్ళీ ధన్యవాదాలు!

@ పద్మార్పిత గారూ,
థ్యాంక్స్ అండీ!

@ anrd గారూ,
"చిన్ని ఆశ" కు స్వాగతం! చాలా ధన్యవాదాలు...

@ మాలా కుమార్ గారూ,
థ్యాంక్స్ అండీ, బొమ్మ నచ్చినందుకు సంతోషం...

@ జయ గారూ,
థ్యాంక్స్ అండీ, అలాగే తప్పకుండానండీ...బొమ్మలూ, కవితలూ, చిన్ని ఆశలూ అన్నీ ఇంకా బోల్డ్ అంటే బోల్డ్ రాస్తాము...

@ చిన్ని గారూ,
Thanks a lot!

@ మధురవాణి గారూ,
"శతటపోత్సవ శుభాకాంక్షలు"...మీ పదలయ విన్యాసం మాకెంతో ఇష్టం.
మా బొమ్మలు మీకు అలవోకగా కనిపిస్తాయి.
మీ మాటలు మాకు అలవోకగా అనిపిస్తాయి.
మీ పోస్ట్ లు ఎప్పుడు చదివినా "అరె మన మాటల్లానే లేవూ మధురవాణి గారివి" అనుకుంటాం...మీ సహజశైలి చదివే ప్రతి మనసుకీ ఉల్లాసం.
అమ్మో వెయ్యి టపాలే....ఇంకో శతకం అవనీండి అప్పుడు చూద్దాం... :)
చాలా ధన్యవాదాలండీ!

మధురవాణి said...

That's so sweet of you. Thank you! :)

Zilebi said...

చిట్టి, పండూ లకి,

సున్నపూజ్యం.

ఒకటి కి సున్న తోడు
సున్న ఒక ఒకటి తో కలిసిందట
చిట్టీ పండూ అయ్యేయి.
సున్నా ఒకటీ కలిసి మరో పూజ్యానికి శతాభిషేకం చేసేయి. శతమానం బ్లాగ్ భవతి అయ్యింది.
మీ బ్లాగ్ మరింత శోభలతో మునుముందుకు సాగాలని కోరు కుంటూ.


చీర్స్
జిలేబి.

☂☆ Vållῐ ★♬ said...

vanda postlu complete chesinanduku subhakankshalu andi :)
eppatilaga meeru ila manchi manchi bommalu....kavitalu rastu untaru ani ashistunnanu :)
All the best and keep smiling :)

"చిన్ని ఆశ" said...

@ మధురవాణి గారూ,
Thanks a lot!

@ జిలేబి గారూ,
వందలో ఒకటీ సున్నా చిట్టీ పండులుగా, మరో సున్నా కలసి బ్లాగ్ కి శతాభిషేకం అంటూ మరింత శోభతో సాగాలన్న మీ కోరికకి చాలా ధన్యవాదాలు...
మీదైన శైలిలో స్పందిస్తూ మమ్మల్నెప్పుడూ అలరిస్తారు...
చీర్స్
@ శ్రీవల్లి గారూ,
తప్పక మరిన్ని మంచి భావాలు మీ అందరితోనూ మాటలు, బొమ్మల రూపంలో పంచుకునే ప్రయత్నం చేస్తాము, మీ అభిమానాన్నికి ధన్యవాదాలు!
Thanks; sure, we keep smiling :)

శోభ said...

వంద టపాలను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న చిట్టి పండులకు శుభాభినందనలు.

ఈ సందర్భంగా రాసిన స్పెషల్ పోస్టు, ఈ పోస్టుకోసం ప్రత్యేకంగా రూపొందించిన బొమ్మా.... సూపరో సూపర్...

చిట్టీ పండులు ఇలాగే వందలు వేలుగా బోలెడన్ని కబుర్లతో మమ్మల్నందరినీ కలకాలం అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. మరోసారి అభినందనలు... :)

Bloggers World said...

100 టపాలు పూర్తి చేసుకున్న చిన్ని ఆశకు అభినందనలు !
ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరతాయంటారు.
"చిన్ని ఆశ" కు ఎప్పటిలాగే 'బ్లాగర్స్ వరల్డ్'ప్రోత్సాహం వుంటుందని తెలుపుతున్నాము.
'బ్లాగర్స్ వరల్డ్' వెబ్సైట్ లో కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేయడం జరిగింది.
రాసిలో,వాసిలో మీ ప్రత్యేకతను ఎప్పటిలాగే కొనసాగాలని ఆశిస్తున్నాను.

"చిన్ని ఆశ" said...

@ శోభ గారూ,
ధన్య వాదాలండీ, మా భావాలూ, బొమ్మలూ మిమ్మల్ని అలరిస్తున్నందుకు చాలా సంతోషం.

@ పల్లా కొండల రావు గారూ (Bloggers World),
మీరు చూపిస్తున్న అభిమానానికీ, ఇస్తున్న ప్రోత్సాహానికీ చాలా ధన్యవాదాలు.
బ్లాగర్స్ వరల్డ్ లో మీరు ప్రత్యేకంగా చెప్పిన అభినందనలకి చాలా థ్యాంక్స్ అండీ!
మా ప్రత్యేకత అంటూ ఒకటుందని మాకూ తెలియదు, ఏదో మా మనసుల్లోని భావాలు రాస్తూ, వాటికి బొమ్మల రూపం ఇస్తూ వెళ్తున్నాము. మీ ప్రోత్సాహం ఎంతో ఉత్సాహాన్నిస్తుంది.

kallurisailabala said...

ముందుగా మీకు బోలెడు అభినందనలు.
మీ మీద కొంచం కోపం గా కూడా ఉంది
మీరు వెన్నెల్లో గోదావరికి ఒక బొమ్మ వేసిపెట్టలేదు అని...
ఈ సారి మాత్రం వేయాలండి ముందే చెప్తున్న...
ఇక పొతే మీ చిట్టి, పండు ఎంతో బావున్నారు.మీ కవితల భావం అంతా వారిలో కనిపిస్తోంది.
మీరు ఇంకో తొమ్మిది వందల పోస్ట్ లు రాసేసి మా అభినందనలు అందుకోవాలని మా మనవి.

"చిన్ని ఆశ" said...

@ శైలబాల గారూ!

చాలా ధన్యవాదాలు.
మీ 'కోపం' తప్పకుండా పోయేలా చూస్తాం...మరి మీ "వెన్నెల్లో గోదావరి" ప్రింట్ అయ్యేనాటికి మేము బొమ్మలెయ్యగలమని మీకూ తెలీదు, మీ నవల ప్రింట్ అవుతుందని మాకూ తెలీదు...అందుకే వెయ్యలేకపోయాము.
ఇప్పుడు మీరింత ముందుగా చెప్తే ఈసారి మాత్రం తప్పకుండా వేసే ప్రయత్నం చేస్తాము...అయితే మాకు మీ నవల అయ్యాక చదివే అవకాశం ఇవ్వండి, కాస్త సమయమూ ఇవ్వండి. మాకు బ్లాగు ముఖంగా కాకుండా ఈ-మెయిల్ ఇవ్వదలిస్తే కి ఇవ్వండి.
మీ "వెన్నెల్లో గోదావరి" చదివే అవకాశం ఇంకా కలగలేదు.
ఇకపోతే మా చిట్టి, పండు బొమ్మల్లో మా ఇద్దరి కవితా భావాలని చూడగలిగారు, చాలా ఆనందం.
ఇంకో తొమ్మిది వందల దాకా మీ అభినందనలు అందవా? ;)
మరో 99 తర్వాత గుర్తుచేస్తాం...తప్పకుండా చెప్పాలి మరి! ;)
చాలా థ్యాంక్స్ అండీ, మీ తదుపరి నవలకి మాకు బొమ్మ వేసే అవకాశం వస్తే మాకెంతో సంతోషం. ఇలా బ్లాగ్ ద్వారా మీ పరిచయం తో మీ నవల కి బొమ్మ వెయ్యగలిగితే ఈ డిజిటల్ యుగంలో మనం కొత్త ఒరవడికి నాంది పలికినట్టే....

"చిన్ని ఆశ" said...

@ శైలబాల గారూ!
బొమ్మకోసం మీ నవల వివరాలు ఈ-మెయిల్ ఇవ్వదలిస్తే chinniaasa@gmail.com కి ఇవ్వండి.

Raja said...

achamaina telugu blog chuste ento teliyani anandam kalugutundi.. chala miss ayyanu anukunta inni rojulu..

"చిన్ని ఆశ" said...

@ Raja,
Welcome to "cinni aaSa"
Chaalaa santhosham...melligaa appudappudoo chadavandi, emee miss avaledu...annttu mee sketches baagunnaayi. Keep doing it!

సుభ/subha said...

ఐ ఐ.. చిట్టి పండు గారి వంద టపాల పండుగ..ఇలాగే ఇంకొన్ని వందల టపాలు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటూ..

"చిన్ని ఆశ" said...

@ సుభ గారూ,
ధన్యవాదాలు...అలాగే తప్పకుండా...

వనజ వనమాలి said...

చిన్ని ఆశకు.. ఆలస్యంగా హృదయ పూర్వక అభినందన మందారమాల.
భావచిత్రాల మాలికలతో..అలరించే మీ బ్లాగ్ చూస్తుంటే.. ఎప్పుడు నాకు అనిపించేది.. "ఓ..వనంలో విహరిస్తున్నానని. " భావం,భాష్యం తో.. రెండింటి మేళవింపులతో.. ఎప్పుడూ..అలరించాలని.. ఆకాంక్షిస్తూ.. చిట్టిపండు (వేర్వేరు కాదు)
మీకు మరొకసారి అభినందనలు.

"చిన్ని ఆశ" said...

వనజ వనమాలి గారూ!
ఆలశ్యం ఏమీ లేదు, చిట్టిపండు వేరు కాదు, కాలేరు.
మీ హృదయపూర్వక అభినందనలకి ధన్యవాదాలు.
మీ భావన లానే మా "చిన్ని ఆశ" లో మీరు మరింత విహరించగలరని ఆశిస్తూ....

Post a Comment