© చిన్ని ఆశ

"నువ్వొచ్చేస్తున్నావని మన తోటంతా మళ్ళీ నవ వసంతం నిండుకుంటోంది
నీకు ఎదురేగి స్వాగతం పలకాలని మన గులాబీ మొన్నే మొగ్గలు తొడిగింది

ఇన్నిరోజులూ ముద్దబంతి తన నవ్వులు నీతోనే పంచుకోవాలనే దాచి ఉంచింది
పూయని చిట్టి చేమంతి కొత్త రంగులు సంతరించి విరబూయటం మొదలెట్టింది

నువులేక పరిమళించనని అలక పానుపెక్కిన మరుమల్లె గుభాళించ సాగింది
చిన్నబోయి అక్కడే ఆగిపోయిన సన్నజాజి తీగ నీకోసం పందిరినల్ల సాగింది

విరియని మందారం తన మోమున సిగ్గు దొంతరలు దాచి విచ్చుకుంటోంది
నిత్యం ఈ నేలపై తిరుగాడే నీ పాద స్పర్శకై లేత పచ్చిక పరుచుకుంటోంది

మన చిలుక అదుగదుగో చిట్టి అని తిరుగుతు మాటిమాటికీ సందడి చేస్తోంది
నీ రాకతొ మా "చిట్టి సంబరాలు" కోసం నింగిన నిండు జాబిలీ తొంగి చూస్తోంది

మాయమైన గడియారం ముల్లూ వచ్చి నా గుండె వేగంతో పోటీ పడుతోంది
నిశ్శబ్ధంలో మూగబోయిన నా హృదయం మళ్ళీ కొత్త రాగాలు ఆలపిస్తోంది"

-మీ చిట్టిపండు
....

18 comments:

రసజ్ఞ said...

హమ్మయ్యా! చిట్టి వచ్చేసిందా? స్వాగతం సుస్వాగతం చిట్టీ! చక్కగా చిత్రంలో రంగులు, గడియారంలో ముళ్ళు, పండు మనసులోకి ఆనందం అన్నీ వచ్చేసాయి!

జ్యోతిర్మయి said...

మా "చిన్ని ఆశ" సంబరం అంబరానికెగసింది
చిట్టి పండుల సహవాసం ముచ్చట గొలుపుతోంది

పల్లా కొండల రావు said...

"ప్రకృతి ప్రేమలో కల్మషం ఉండదు.
ప్రకృతి అమ్మ మనసుకన్నా, పసిమనసుల కేరింతలకన్నా గొప్పది.
ప్రకృతిని పోల్చుతూ చిట్టి రాకకై చూస్తున్న మీ మనసు "ఆరాధన" మీ తోట వర్ణనలో, చిట్టికి స్వాగతం పలుకుతున్న బొమ్మ రంగులలో కనపడుతోంది.వినబడుతోంది కూడా !
చందమామను చూడలేని,చల్లగాలిలో పరవశించలేని,సహజత్వాన్ని సర్వత్రా కోల్పోతున్న ఈ రోజులలో మీ బ్లాగు ప్రకృతి ప్రేమను , ఆరాధానా భావాన్నీ ఎంతో కొంత , కొందరిలో్నైనా మేలుకొలుపుతందని " చిన్ని ఆశ "

చిన్ని said...

ప్రతి అక్షరం పదం వాక్యం ప్రకృతిని కళ్ళ ముందు ఆవిష్కరిస్తుంది .మనస్సుని తాకుతున్న మీ పదవిన్యాసం నిజ్జంగా మీ చిట్టి అదృష్టవంతురాలే .చాల చాల బాగుంది .

మధురవాణి said...

Beautiful.. బొమ్మ ఇంకా అందంగా ఉంది. :)

తెలుగు పాటలు said...

nice di

"చిన్ని ఆశ" said...

@ రసజ్ఞ గారూ!
ధన్యవాదాలు, మా ఇద్దరి తరపునా. పండు స్వాగతంతో మాట కలిపారు, చాలా సంతోషం...

@ జ్యోతిర్మయి గారూ!
అవునండీ! పండు సంబరం ఆకాశం తాకి పున్నమిలా విరిసింది...ముచ్చటగా ఎప్పటికీ అలానే నిండుగా విరియాలనే మా "చిన్ని ఆశ". ధన్యవాదాలు!

@పల్లా కొండల రావు గారూ!
ప్రకృతిలా ప్రేమా స్వచ్ఛమైనదే, మా రంగులు కనటమే కాదు, అందులో ప్రేమ సంతోషాలూ వినగలిగారు, చాలా ఆనందం. మా భావాలు చదివి కొందరైనా ప్రేమని వీడక కలకాలం ప్రేమగా ఉండగలిగితే మా ఈ "చిన్ని ఆశ(యం)" నెరవేరినట్టే...ధన్యవాదాలు!

@చిన్ని గారూ!
చాలా ధన్యవాదాలు, నిజానికి అదృష్టవంతురాలు చిట్టి కాదు, పండు. ;) పండుని ప్రేమగా చూసుకునే చిట్టి లాంటి ప్రియురాలి ప్రేమని పొందగలిగిన ప్రతి పండూ అదృష్టవంతుడే...

@ మధురవాణి గారూ!
Thank you so much, అందమైన బొమ్మలకి స్ఫూర్తి అయి వేయించే చిట్టిదే ఆ credit అంతా... ;)

@ తెలుగు పాటలు
Thanks అండీ!

kallurisailabala said...

Nice expression...

"చిన్ని ఆశ" said...

@ శైలబాల గారూ!
థ్యాంక్స్ అండీ!

Anonymous said...

waaaw!!! chiluka chese sandadi.. chalaa baavundandi mee expression...ee blog choosinappudantha nenu bale jealous feel avuthaanu mee chitti entha lucky...

Anonymous said...

hammayya chitti vachesindi maaku kooda mee chittini choodaalani vundandi asalu meekanna mee chitti ne ekkuvagaa choodalani vundi ika maake ilaa vunte meekelaa vundemo...

C.ఉమాదేవి said...

చిలుక వాలిన తోట,జాబిలి పరిచిన వెన్నెల,పూలు పరిచిన కవిత!

"చిన్ని ఆశ" said...

@ Anonymous గారూ!
ధన్యవాదాలు...
చిట్టిని చూడాలని ఉందా? నిజంగా?
మీకింకా కనబడలేదా? మేమేసే బొమ్మల్లో ప్రతి గీతా, ప్రతి రంగూ చిట్టే నండీ! జెలసీ మాత్రం వద్దే...;)

"చిన్ని ఆశ" said...

@ C.ఉమాదేవి గారూ!
చాలా ధన్యవాదాలు...ముచ్చటగా మూడు పంక్తుల్లో మా "చిట్టి సంబరాన్ని" చెప్పేశారు. ;)

nelabaludu said...

చిట్టి సంబరాలు అంబరాన్ని అంటాయండి... చాలా సంతోషం :)

"చిన్ని ఆశ" said...

@ nelabaludu
చాలా థ్యాంక్స్ అండీ!

madhavarao.pabbaraju said...

శ్రీ చిట్టిగారికి, నమస్కారములు.

ఇప్పుడే మీ కవితలన్నిటినీ చదివాను. చాలా బాగున్నాయి. మీ కవితలకు, మీ రంగుల బొమ్మలు కంటికి కాటుకనద్దినట్లుగా వున్నది. మీ `చిట్టీ-పండూల' కవితా ప్రేమ ` ఎప్పుడూ పండాలని కోరుకుంటూ, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేస్తూ,

మీ స్నేహశీలి,
మాధవరావు.

"చిన్ని ఆశ" said...

మాధవరావు గారికి,
నమస్సుమాలు!
మా కవితలూ బొమ్మలూ మనసారా మెచ్చి మీరిచ్చిన ప్రశంశలు మాకెంతో స్ఫూర్తి సుమాలు. రంగుల బొమ్మలు మా భావాలకద్దం పట్టి, మీరిచ్చిన ప్రశంశలా "కంటికి కాటుకలా" దిద్దించే స్ఫూర్తి "మా చిట్టి" ప్రేమ. కవితా, ప్రేమా పండాలని మనసారా మీరన్న మాట పండే రోజుకై ఎదురుచూపే మా "చిన్ని ఆశ"...
ధన్యవాదాలతో,
మీ "చిట్టి, పండు"

Post a Comment