© చిన్ని ఆశ
"నిన్నొదలి ఒక్కరోజైనా ఉండలేని నన్ను ఒంటరి చేసెళ్ళావ్...ఇన్ని రోజులా
నిన్నే మదిలో తలచుకుంటూ క్షణమో యుగంలా గడిపేశా...ఎలాగోలా
రేపు నువ్వొచ్చేస్తావని ఈరోజంతా నా కనులు రెప్పపడనంటున్నాయి...ఎలా
నువ్వొచ్చేస్తున్నావన్న సంబరంలో పొద్దున మర్చిపోయాను...అన్నీ మరలా
నువు లేక నిజంగానే ఇన్నిరోజులు గడపగలిగానా ఇది నిజమేనా...లేక కలా
మళ్ళీ నన్నిలా ఒంటరిగా వదలి ఎక్కడికీ వెళ్ళవుగా ఇక...ఎన్నడూ ఇలా
నవ్వుతు నువు తెచ్చే నవ్వుల వసంతంకై ఎదురుచూస్తున్నా...నే కోయిలలా"
-మీ చిట్టి, పండు
..♥♥..

14 comments:
cool
మొన్నేగా 'పరిగెత్తుకుని వచ్చేశా' అన్నారు. అంతలోనే వెళ్లిపోయారా..చిట్టీ, పండు కోసం త్వరగా వచ్చెయ్యరూ...
ఐతే చిట్టి వచ్చేస్తున్నారన్నమాట..భలే భలే.. చిత్రం చాలా చక్కగా సింపుల్ గా ఉందండీ.
@ తెలుగు పాటలు,
Thanks!
@ జ్యోతిర్మయి గారూ,
మొన్న పరిగెత్తుకు వచ్చేస్తాగా...అంది ఏదీ ఇంకా రాలేదు మరి :(
@ సుభ గారూ!
కనిపెట్టేశారు ;) రాకకోసం అందరమూ ఎదురు చూస్తూ ఉన్నాము, ఆ చిత్రంలోలా ఒంటరిగా...ధన్యవాదాలు, చిత్రం నచ్చిందన్నారు....
వచ్చాక ఇక పాట పాడేయండి ! పాటకు బొమ్మ కూడా గీసేయండి !!
చిట్టి లేకపోయేసరికి పండుకి జీవితంలోనే కాదు బొమ్మలో కూడా రంగులు దూరమయ్యాయనమాట! చిట్టి నవ్వుల వసంతం కోసం మేము కూడా చూస్తున్నాం అండీ!
Where there is love, there is life and liveliness!
cheers
zilebi.
విరహం, ఎదురు చూపులు తియ్యనైన అనుభూతి
@ పల్లా కొండల రావు గారూ,
హ హా హ్హా...ఒక్క పాటేనా, బొమ్మతో బాటు ఏకంగా సంబరాలే జరుపుకోమూ! ;)
@ రసజ్ఞ గారూ,
బొమ్మలో మా భావాన్ని ఠక్కున కనిపెట్టేశారు, చిట్టి లేక రంగులూ దూరమయ్యాయి, థ్యాంక్స్ అండీ, మీరందరూ చూపిస్తున్న ఆప్యాతకి చిట్టి, పండుల పైన...
@ జిలేబి గారూ,
Exactly,
Liveliness comes only with love
Otherwise, it becomes loneliness...
Thanks a lot!
@ kastephale గారూ,
నిజమేనండీ....విరహం లోనే ఉన్నది అనుబంధం...కలువకు చంద్రుడు ఎంతో దూరం...
కదూ!
నవ్వుతు నువు తెచ్చే నవ్వుల వసంతంకై ఎదురుచూస్తున్నా...నే కోయిలలా"
chala bavundi.
@ శైలబాల గారూ,
ధన్యవాదాలు!
మీ చిట్టి రాకతో ఈ బొమ్మలో రంగులు విరిసాయన్నమాట.. భలే భలే! :)
@ మధురవాణి గారూ!
చక్కగా గమనించారు. బొమ్మలో రంగులూ, పండు మదిలో ఆనందం వెల్లి విరిసింది.
Post a Comment