© చిన్ని ఆశ

"కలసి నడవాల్సిన జీవన దారులు వేరైపోతే
కనుచూపు మేరనంతా కారు చీకటే అయితే
ఎక్కడికీ గమ్యం తెలియని బ్రతుకు పయనం
ఎందులకీ శృతీ గతీ తప్పిన జీవన సమరం

కానరాని బాటన ఎదురై వెళుతూ కనిపిస్తావనా
చీకటి మాటున చిరుదీపమై వెలుగులు తెస్తావనా
కలలుగన్న మనసున ఆశలు నువ్వై తీరుస్తావనా
నాతో రాని గతంలో రేపై నా పక్కన నిలుస్తావనా

నీకోసం వగచిన ఈ గుండెని శోధించి చూసినా
జన్మంతా దక్కిందీ ఆరని ఆ కన్నీటి ధారలేనా
అందరాని మరో లోకానికి తరలి నేనెళ్ళిపోయినా
చిరిగిన బ్రతుకున అతుకు నీకైనా సాధ్యమగునా"

-మీ చిట్టిపండు
....

11 comments:

రసజ్ఞ said...

గుండెల్లో బాధలని కలిపి కుట్టలేనప్పుడు విడిపోవడమే సమాధానమంటారా? నేను పరిచయం చేసే చిత్రకారుల లిస్టులో ఎప్పుడో మిమ్మల్ని కూడా పరిచయం చేసేస్తానేమో అని భయంగా ఉంది! ఎంత బాగా వేసారో! గుండె ఒక పక్క అబ్బాయి ఒక ప్రక్క అమ్మాయి అబ్బా మాటలు లేవు అమోఘం అంతే! చూసి ఆలానే ఉండిపోయా కింద కవిత వైపు రానంటున్న నా కనులని బలవంతాన ఈడ్చుకుని వచ్చా అవి మాత్రం మళ్ళీ బొమ్మ వైపే వెళుతున్నాయి!

చిన్ని ఆశ said...

రసజ్ఞ గారూ,
ఎప్పటిలా మీదే మొదటి స్పందన. స్ఫూర్తిదాయకం.

కలసిన మనసులు బాధల్లోనైనా విడిపోవటం ఎన్నడూ సమాధానం కానే కాదు. కలిసే ఉంటే బాధల్లోనూ కలసి ఉన్నామన్న ఆనందం ఉంటుంది. విడిపోతే ఆనందంలోనూ కలసి లేమే అన్న దుఃఖమే మిగుల్తుంది. అవునంటారా?

మా బొమ్మలు మీరు చాలా మెచ్చుకుంటున్నారు, మీరలా అన్నప్పుడల్లా నిజంగా అంత బాగా వేస్తున్నామా అనిపిస్తుంది. మీరు పరిచయం చేసే ఆర్టిస్ట్ ల స్థాయికి మేమింకా చాలా దూరంలో ఉన్నాము.

మీ ఆదరణకీ, స్పందనకీ చాలా ధన్యవాదాలు.

Zilebi said...

దీనికి నాకు తెలిసినంత వరకు ఒకే ఒక 'సొల్యూషన్' వుందండీ!

చిట్టి పండుగా మారాలి. పండు చిట్టి గా మారాలి. అప్పుడు వేరైన గమ్యాలు అంటూ ఏవీ లేవు.అంతా ఒక్కటే అయిన ఆ 'రాధ'నా మార్గమే !

చీర్స్
జిలేబి.

చిన్ని ఆశ said...

జిలేబి గారూ!
అటుకులు చిటుకుల్లా, చిట్టీ పండులు అంత సులభంగా గమ్యాలు మారగలరా?
ఆ 'రాధ' నా మార్గం అన్నారు, ఇది బాగుంది. ;)
ఆ 'రాధ'నా మార్గమే !
థ్యాంక్స్ అండీ!

Zilebi said...

అనుకున్నా, ఆ కామెంటు రాసాక, మీరు మళ్ళీ 'ఆ' రాధ' నా మార్గమే దగ్గిరికే వస్తారని! కనిబెట్టేసారు 'ఆ రాధ నా మార్గమే అని !'

చీర్స్
జిలేబి.

చిన్ని ఆశ said...

హ హా జెలేబి గారూ! పట్టేశారు ఆ 'రాధ' నా మార్గమే అని ;)

వేణూ శ్రీకాంత్ said...

మీరు గీసిన బొమ్మ చాలా బాగుందండీ...(అంటే కవిత బాలేదని కాదు :)
అలాగే కొత్త టెంప్లేట్ కూడా బాగుంది.

పల్లా కొండల రావు said...

" తెలిసీ తెలిసీ విలపించుటలో .... తీయదనం " చిట్టి-పండులకు ఇంతగా తెలుసని తెలుసుకోకుండానే మన'సు'కవి ఆత్రేయ వెళ్ళిపోయారు.
అతుకు లేని బ్రతుకుంటుందా ?
నాతో రాని గతంలో రేపై నా పక్కన నిలుస్తావనా? అన్నారుగా !
"రే్పైనా" నిలుస్తావా? అన్న సందేహం - నిలవకపోతావా? అని
"చిన్ని ఆశ" ఎవరికైనా సహజమే !
మీరు గీసే బొమ్మలు అద్భుతంగా వుంటున్నాయి.

చిన్ని ఆశ said...

@ వేణూ శ్రీకాంత్ గారు,
కవిత కన్నా బొమ్మలకే మరిన్ని కాంప్లిమెంట్స్ వస్తున్నాయి మదిలో భావాలు లేనిదే బొమ్మలు లేవు ;) టెంప్లేట్ బ్రేక్ అయ్యిందని మీరన్నాకే మార్చాము, థ్యాంక్స్ అండీ!

@ పల్లా కొండల రావు గారు,
మేము రాసే మాటలని మీరు చక్కగా ఎనలైజ్ చేసి మరీ చెప్తారు. మీ కామెంట్స్ మాకెంతో ముచ్చట గొల్పుతాయి. వలచుటలోనే కాదు, "విలపించుటలో తియ్యదనం..." ఉందన్న మన'సు'కవి గారి పాటను గుర్తుచేశారు, చాలా థ్యాంక్స్.
మీరన్నట్టు సందేహంలో నమ్మకమూ దాగి ఉంటుంది.
బొమ్మలూ నచ్చాయనటం మాకెంతో ప్రోత్సాహం.
ధన్యవాదాలు!

సుభ/subha said...

ఏంటండీ ఈ అన్యాయం? నన్నింక పైకి లేవనీయరా? ఇలా ఎన్ని సార్లు పడేస్తారండీ? ఏదో సరదాగా అన్నానండోయ్. ఏం చేయను చెప్పండి..ఆ చిత్రాలు అంత పని చేస్తున్నాయ్.అలా అనకూడదు అని చెప్తున్నా మనసుకు వినపడదే అసలు.ఏదేమైనా ఈ రోజు ఆ చిత్రం దానికి తగ్గ భావం..మనసు గాడి తప్పింది...అందుకే ఈ వ్యాఖ్య చిట్టి పండు గారూ..ఇలాగే ఇంకా ఎత్తుకి ఎదగాలని ఆశిస్తూ..

చిన్ని ఆశ said...

సుభ గారూ!
పడ్డారా మళ్ళీ? అయ్యో!! ఏం చెయ్యం చెప్పండీ...మా చిట్టేమో భలే భలే అని చప్పట్ట్లు కొడుతూనే ఉంది. మిమ్మల్ని చూసి కాదండోయ్, బొమ్మలు చూసి. ;)
మీరు పడే కొద్దీ మీ మనసుని ఇంకా మంచి బొమ్మల్తో రంజింపచేయాలని మా "చిన్ని ఆశ".
మనసారా మా బొమ్మలకి మీరిచ్చిన ఆశీస్సులకి చిట్టి, పండుల ధన్యవాదాలు.

Post a Comment