© చిన్ని ఆశ
"నిన్న కరిగిపోయిన అందని జ్ఞాపకం
రేపు కమ్మని ఆశల ఊహా గగనం
నేడా జ్ఞాపకాల ఆశని కలిపే నిజం
నిన్న నేడు రేపుల కలయికే జీవితం
కరిగిన నిన్నటిలో చెరగని
జ్ఞాపకం అందని మన ప్రేమ
రేపటి ఆశల ఊహల్లో కమ్మని
ఆశాభావం అందలాన మన ప్రేమ
నేడు మదిలో చిగురించే తియ్యని
జ్ఞాపక రూపం అందమైన మన ప్రేమ
నిన్నటి జ్ఞాపకంలో అందని నా నువ్వే
రేపటి ఆశలఊహల అందలాల్లో నువ్వే
నేటి తియ్యని ప్రేమలో అందమైన నువ్వే
నిన్నా, నేడూ, రేపూ నువ్వే నా నువ్వే "
-మీ చిట్టి, పండు
..♥♥..
రేపు కమ్మని ఆశల ఊహా గగనం
నేడా జ్ఞాపకాల ఆశని కలిపే నిజం
నిన్న నేడు రేపుల కలయికే జీవితం
కరిగిన నిన్నటిలో చెరగని
జ్ఞాపకం అందని మన ప్రేమ
రేపటి ఆశల ఊహల్లో కమ్మని
ఆశాభావం అందలాన మన ప్రేమ
నేడు మదిలో చిగురించే తియ్యని
జ్ఞాపక రూపం అందమైన మన ప్రేమ
నిన్నటి జ్ఞాపకంలో అందని నా నువ్వే
రేపటి ఆశలఊహల అందలాల్లో నువ్వే
నేటి తియ్యని ప్రేమలో అందమైన నువ్వే
నిన్నా, నేడూ, రేపూ నువ్వే నా నువ్వే "
-మీ చిట్టి, పండు
..♥♥..






12 comments:
చాలా బాగుంది అన్న పదం చిన్నదవుతుందేమో! మీ కవిత ఒక మనిషి మొండెం లాగా ఆ బొమ్మ అదే మనిషి మోము లాగా ఉంది చూడటానికి ఆ అమరిక అలా కుదిరింది. ఇహ మీరు గీసిన చిత్రం గురించి చెప్పక్కర్లేదు! అద్భుతం!
రసజ్ఞ గారూ! చాలా ధన్యవాదాలు, బొమ్మ ఇంకాస్త బాగా వేసి ఉండాల్సిందేమో అనుకున్నాము.
మీరు నచ్చింది అన్నారు...హమ్మయ్య అనుకుంటున్నాం...;)
ఇది చిన్ని ఆశ కాదు ! ఈ రోజుల్లో చాలా పెద్ద ఆశ !! మనసున్న వారి మంచి ఆశ !!!
హృదయమున్నవారికే ఇది సాధ్యం ! లేనివారికి అసాధ్యం !! ప్రేమ - ఇది అమూల్యం !!!
అంతా " ప్రేమ " మయం ! జీవితమంతా!! జీవనమంతా !!!
కొండల రావు గారూ!
ప్రేమ గురించి సత్య వాక్యాలు చాలా బాగా చెప్పారండీ!
"ప్రేమ - ఇది అమూల్యం" ఇది అక్షరాలా నిజం. అది పొందిన వారికంటే పొందలేక పోయిన వారికే దాని విలువ తెలుస్తుంది కదూ!
ఇంత ప్రేమ గా స్పందించారు. చాలా ధన్యవాదాలండీ!
WOW..కవిత చదివాక బొమ్మ చూస్తే, భావం రెండిటికీ ఎంత చక్కగా కుదిరింది అనిపించింది. ఆఖరి నాలుగు వాక్యాలు చాలా బావున్నాయి.
జ్యోతిర్మయి గారూ!
ధన్యవాదాలు, భావం తో కలిపి బొమ్మా చూడగలిగారు, చాలా సంతోషం.
బాగుందండీ
Thanks చిన్ని గారూ!
బొమ్మా, కవితా రెండూ బాగున్నాయి. చివరి నాలుగు లైన్లూ మరింత నచ్చేసాయి.. :)
చాలా థ్యాంక్స్ అండీ మధురవాణి గారూ!
చిన్ని చిన్ని ఆశ గారూ : కవితలూ రచనలతో బాటూ చిత్రలేఖనం కూడా జోడించిన మీ బహుముఖ ప్రఙ్ఞ కి నా అభినందనలు. మరీన్ని టపాలు రాయాలని కోరుకొంటూ..
- నందు
నందు గారూ,
మీ ప్రశంశలకి చాలా ధన్యవాదాలు...మీ ప్రోత్సాహంతో మా భావాలు మరిన్నిటికి అక్షర, రంగుల, భావ గీ(త)తాల రూపం ఇచ్చే ప్రయత్నం చేస్తాము.
అన్నట్టు మీ బ్లాగ్ లో ఒక్కటితనం టపా ఇప్పుడే చదివాము, అద్భుతం!
Post a Comment