© 2012 చిన్ని ఆశ, All Rights Reserved
"నూతనం"
అంటేనే ఎవరికైనా మనసున ఉత్సాహం నిండుకుంటుంది. ప్రతి ఉదయమూ నూతనమే, అయినా అది రోజూ వచ్చే ఉదయంలానే అనిపిస్తుంది. అందులో నూతనం ఏముంది...నిన్నటి సూర్యుడే, చుట్టూ నిన్నటి ఆ మనుషులే, ఆ పరిసరాలే...ఎప్పుడైనా ఎవరై నా కొత్తవాళ్ళు మనింటికి వచ్చినా, కొత్త ప్రదేశాలకి మనమెళ్ళినా ఆ రోజేదో నూతనంగా అనిపిస్తుంది. లేదంటే మళ్ళీ షరా మామూలే...రోజూ రొటీన్...పని, పని, పనీ...
మరి నేడో...నిన్నటి ఆ ఉదయమే, ఆ మనుషులే, ఆ పరిసరాలే...అయినా ఏదో నూతనత్వం మది బయటా, లోపలా, ప్రతిఒక్కరిలోనూ...
అదే ఈనాటి ప్రత్యేకం...
నూతనం...
నూతనత్వం... 

"నూతన సంవత్సరం"
కొత్త సంవత్సరం మన జీవితంలో అడుగిడుతుందంటేనే ఎక్కడలేని ఉత్సాహమూ వచ్చేస్తుంది కదూ అందరిలోనూ! అది చెయ్యాలీ, ఇది చెయ్యాలీ, అలా ఉండాలీ, ఇది సాధించాలీ...అనుకుంటూ ఎన్నో కొత్త కొత్త రిజల్యూషన్స్ మన లిస్ట్ లో చటుక్కున చేరిపోతాయి. జీవితంలో పాతదై వెనక్కెళ్ళిపోతున్న 'పాత' సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ 'కొత్త' సంవత్సరాన్ని సంతోష, సగర్వ, సాదర,స్వాగతాలతో ఆహ్వానిస్తూ నూతనోత్సాహం ఉరకలు వేసే ఆ క్షణాన ప్రపంచం అంతా సందడిగా జరుపుకునే ఏకైక పండుగ ఇదొక్కటే కదూ!

"గత కాలంలో కలసి పోయే నిన్న
గుండె జ్ఞాపకాల్లో  ఎన్నటికీ మిన్న
నిన్న పోయినా నేనున్నాననే రేపు
మదిలో మరలా చిగురాశలు రేపు

నిన్న మెదిలే జ్ఞాపకాల స్వగతం
రేపు
మదిలో ఆనందాల స్వాగతం"

ఈ నూతన సంవత్సరం అందరి జీవితాల్లోనూ శుభప్రదాయకం అవ్వాలని ఆకాంక్షిస్తూ,
నూతన "శుభప్రద" ఆకాంక్షలతో...
నూతన సంవత్సర శుభాకాంక్షలతో "2012" కి సుస్వాగతం...
-మీ చిట్టిపండు
....

32 comments:

జయ said...

మీకు నా హృదయ పూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.

చిన్ని ఆశ said...

@ జయ గారూ, ధన్యవాదాలు!
మీకూ నూతన సంవత్సర శుభాకాంక్షలు!

రాజి said...

నూతన సంవత్సర శుభాకాంక్షలు.
Wish You A Happy New year 2012

చిన్ని ఆశ said...

@ రాజి గారూ!
మీకూ మా నూతన సంవత్సర శుభాకాంక్షలు.

పల్లా కొండల రావు said...

" నిన్న పోయినా నేనున్నాననే రేపు
మదిలో మరలా చిగురాశలు రేపు "
- నిన్నటి కన్నా నేడు , నేటి కన్నా రేపు ఎప్పుడూ కొత్తగా
అభివృద్దికరంగా వుంటాయి. వుండాలి .
" నూతన సంవత్సర శుభాకాంక్షలు "
" Wish You A Happy New year 2012 "

phani said...

"గత కాలంలో కలసి పోయే నిన్న
గుండె జ్ఞాపకాల్లో ఎన్నటికీ మిన్న
నిన్న పోయినా నేనున్నాననే రేపు.
అబ్బ చాలా అద్భుతంగా ఉందండి. మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.

SRRao said...

2012 నూతన సంవత్సర ( ఆంగ్ల ) శుభాకాంక్షలతో.....
నూతనోత్సాహం ( శిరాకదంబం )

రసజ్ఞ said...

మీ ఇరువురికీ నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు!

kallurisailabala said...

"గత కాలంలో కలసి పోయే నిన్న
గుండె జ్ఞాపకాల్లో ఎన్నటికీ మిన్న
నిన్న పోయినా నేనున్నాననే రేపు.

మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

చిన్ని ఆశ said...

@ పల్లా కొండల రావు గారు,
@ phani గారు,
@ SRRao గారు,
@ శైలబాల గారు,
థ్యాంక్స్ అండీ, మీ అందరికీ మా నూతన సంవత్సర శుభాకాంక్షలు !

చిన్ని ఆశ said...

రసజ్ఞ గారూ!
ధన్యవాదాలు.
మా ఇరువురి తరపునా మీకూ మా నూతన సంవత్సర శుభాకాంక్షలు !

కాయల నాగేంద్ర said...

మీకూ నూతన సంవత్సర శుభాకాంక్షలు !

"చిన్ని ఆశ" said...

నాగేంద్ర గారూ!
మీకూ మా నూతన సంవత్సర శుభాకాంక్షలు!

సుభ/subha said...

మీ ఇద్దరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు చిట్టి పండు గారూ..

బులుసు సుబ్రహ్మణ్యం said...

మీకు,

నూతన సంవత్సర శుభాకాంక్షలు.

kastephale said...

wish you happy new year2012

sreenika said...

Wish you the same

శ్రీలలిత said...

నూతన సంవత్సర శుభాకాంక్షలు...

"చిన్ని ఆశ" said...

@ సుభ గారు,
@ బులుసు సుబ్రహ్మణ్యం గారు,
@ కష్టేఫలే శర్మ గారు,
@ శ్రీనిక గారు,
@ శ్రీలలిత గారు,
......మీ అందరికీ మా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు...

డేవిడ్ said...

చిన్ని ఆశ గారు మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

డేవిడ్ said...

చిన్ని ఆశ గారు మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

"చిన్ని ఆశ" said...

@ డేవిడ్ గారూ!
ధన్యవాదాలు! మీకూ మా నూతన సంవత్సర శుభాకాంక్షలు!

నందు said...

బ్లాగ్ మితృలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు! :)

"చిన్ని ఆశ" said...

@ నందు
మీకూ మా నూతన సంవత్సర శుభాకాంక్షలు!

వేణూ శ్రీకాంత్ said...

మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు...

"చిన్ని ఆశ" said...

వేణూ శ్రీకాంత్ గారూ!
మీకూ మా నూతన సంవత్సర శుభాకాంక్షలు!

మధురవాణి said...

గ్రీటింగ్ బావుందండీ.. మీరు భలే చకచకా బొమ్మలు గీసేస్తారే! :)
హ్యాపీ న్యూ ఇయర్!

"చిన్ని ఆశ" said...

థ్యాంక్స్ మధురవాణి గారూ!
అంతా మా చిట్టి మహిమ, గీయించేది తనే :)
హ్యాపీ న్యూ ఇయర్ టు యూ టూ!

రమణారెడ్డి said...

మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు.

"చిన్ని ఆశ" said...

రమణారెడ్డి గారూ!
మీకూ మా నూతన సంవత్సర శుభాకాంక్షలు!

rajachandra akkireddi said...

Wish You A Happy New Year.. andi

"చిన్ని ఆశ" said...

@ rajachandra akkireddi
We too Wish you a Happy New Year!

Post a Comment