© చిన్ని ఆశ

"నువు లేవని తెలిసినా ఆగక పాపం నా మది
ఉదయ వెలుగున నీకోసం మళ్ళీ వెదికి వెదికి
వెలుగు మలచిన నా నీడని కని నీవని తలచి
వెనుదిరిగె నను వదలని ఆ నీడన నిను చూచి

నువులేని నాకు సాగని కాలమె ఓ గగనమాయె
దిక్కుతోచని మనసున ఆలోచనలే నేస్తములాయె
కదలని కాలంతో మది దిగులుగ ముందుకిసాగె
నీ రాకాకై శూన్యం వెనుక ఒంటరిగ చూడసాగె

నీకై వేచిన నాకై చప్పున కదలి రావా ప్రాణామా
నా ఉనికి నిను తాకిన వెంటనె పరుగున నేస్తమా
ఒంటరి పయనం ఆపుతూ పక్కన నడిచే తోడుగా
చీకటి శూన్యం చీలుస్తూ రేపటి ఉదయకిరణంలా"

-మీ చిట్టిపండు
....

6 comments:

రసజ్ఞ said...

దిక్కుతోచని మనసున ఆలోచనలే నేస్తములాయె
కదలని కాలంతో మది దిగులుగ ముందుకిసాగె
అద్భుతమయిన పదజాలాలు మీ వచనంలో, వచనంలోని భావ వ్యక్తీకరణ అంతా మీ చిత్రంలో చూపిస్తూ మమ్మల్ని ఇలానే ఎప్పటికీ అలరిస్తూ ఉండండి!

చిన్ని ఆశ said...

రసజ్ఞ గారూ! చాలా ధన్యవాదాలు!
ఎప్పటిలా మళ్ళీ మళ్ళీ మొదటి స్పందనతో మమ్మల్ని ఉత్సాహపరుస్తూనే ఉన్నారు.
మరింతగా అలరించే మా ప్రయత్నం కి మీ స్పందన లే ప్రోత్సాహం.

జ్యోతిర్మయి said...

"నీకై వేచిన నాకై చప్పున కదలి రావా ప్రాణామా
నా ఉనికి నిను తాకిన వెంటనె పరుగున నేస్తమా"

చాలా బావుంది...మీరు బొమ్మలు కూడా భలే వేస్తారండీ..

చిన్ని ఆశ said...

జ్యోతిర్మయి గారూ, ధన్యవాదాలు.
ఆ బొమ్మలు కూడా వేస్తామండీ! మా చిట్టి దగ్గరుండి మరీ తన పండుతో భలే బొమ్మలు వేయిస్తుంది, లేదంటే ఊరుకోదు మరి, పండు బొమ్మలంటే తనకంత ఇష్టం ;)

subha said...

చూసారా! ఎలా తెలిసిందో ఏమో చప్పున వచ్చేసా చీకట్లను చీల్చుకుంటూ!
చాలా బాగుందండీ పదాల పొందిక.
ఆ చిత్రం కూడా.

చిన్ని ఆశ said...

శుభ గారూ! చాలా సంతోషం అండీ, వస్తూ మా "చిట్టి"నీ పట్టుకు రాలేక పోయారా?
Thanks again!

Post a Comment