© చిన్ని ఆశ
♥... ... ... ...
నీ ధ్యాసలొ ప్రతి రేయీ
చీకటి రెప్పల మాటున కనుమూస్తున్నా
నీ రాకతో కలలో
కలత నిదురన లేచి నీకై వెదుకుతు ఉన్నా
నీ తలపుతో ఉదయం
కనులు తెరచి కొత్తగ జీవం పోసుకుంటున్నా
నీ పిలుపుతో ప్రపంచం
మరచి కాసేపైనా రోజూ నిజంగా జీవిస్తున్నా
నీ కోసం జీవితమంతా
ఎదురు చూపుల నిరీక్షణల్లోనే వేచి ఉన్నా
నాకోసం రాగలవా నేస్తం
నా తుది శ్వాస నను వీడి నిను చేరేలోపన్నా
... ... ... ...♥
© చిన్ని ఆశ
..♥♥..
నీ ధ్యాసలొ ప్రతి రేయీ
చీకటి రెప్పల మాటున కనుమూస్తున్నా
నీ రాకతో కలలో
కలత నిదురన లేచి నీకై వెదుకుతు ఉన్నా
నీ తలపుతో ఉదయం
కనులు తెరచి కొత్తగ జీవం పోసుకుంటున్నా
నీ పిలుపుతో ప్రపంచం
మరచి కాసేపైనా రోజూ నిజంగా జీవిస్తున్నా
నీ కోసం జీవితమంతా
ఎదురు చూపుల నిరీక్షణల్లోనే వేచి ఉన్నా
నాకోసం రాగలవా నేస్తం
నా తుది శ్వాస నను వీడి నిను చేరేలోపన్నా
... ... ... ...♥
© చిన్ని ఆశ
..♥♥..
-మీ చిట్టి, పండు






10 comments:
ఇంతలా రాస్తే ఎక్కడున్నా వెంటనే మీ ముందుకి వస్తుంది మీ నేస్తం! చాలా చాలా బాగుంది!
రసజ్ఞ గారూ!
మా రాతలకి మొదటి స్పందన ఎప్పుడూ మీదే...
నేస్తం ఎక్కడున్నా ముందుకి వస్తుందన్న మీ వాక్కు నెరవేరాలని మా "చిన్ని ఆశ"...
చాలా ధన్యవాదాలండీ!!!
Chala bavundi me kavitha....me dinchina chitram kuda...:)
MEeru uhinchukuni geestara...leka edaina painting chusi inpire ayyi geestara :)
NIce feel in your paintings :)
nice
చిత్రం సహజంగా, అందంగా ఉంది. రంగులు చక్కగా అమిరాయి. చిత్రానికి తగ్గ కవిత.
@శ్రీవల్లి
శ్రీవల్లి గారూ! కవితా చిత్రం రెండూ నచ్చాయన్నారు. ధన్యవాదాలు.
ఊహించుకుని గీసిన చిత్రమే అది. అయితే చిట్టి ఎప్పుడూ పండు కళ్ళల్లోనే కదలాడుతూ ఉంటుంది. అప్పుడప్పుడూ ఇలా రంగుల రూపంలో "చిట్టి పండు" ల కుంచె నుంచి జాలు వారుతుంది...:)
@చిన్ని
Thanks అండీ!
@జ్యోతిర్మయి
జ్యోతిర్మయి గారూ! మీ inspiring స్పందనకి చాలా ధన్యవాదాలు.
చాలా బాగుందండీ..
Thanks వేణూ శ్రీకాంత్ గారూ!
చాలా బావుందండి.ఎప్పటిలా బాగా రాసారు.
శైలబాల గారూ!
చాలా రోజులకి మళ్ళీ మీ రాక, ధన్యవాదాలు!
Post a Comment