© చిన్ని ఆశ

... ... ... ...

"మెడ వంపుని తాకిన ఆ ముంగురులూ
మెడపై జాలువారిన ఆ వాలు జడా
నువ్వా నేనా ఎవరు గొప్పంటూ జగడమాడి
నన్నడగ 'అది చూడగనైనా నోచుకోలేని
నాకన్నా మీరిద్దరూ గొప్పే కదా' అన్నా

'హన్నన్నన్నా అంత మాటా ఆ మెడ వంపున
దాగిన చెలి కోమలం చూసిన కాదు తాకిన కాదు
చూడకనే తాకకనే అక్కడ వీణలు మీటే
నీ వెచ్చని తలపున చెలి కదలిన ఆ ఝామున
చూసి చిన్నబోయిన మేమా' అన విని నవ్వుకున్నా..."

... ... ... ...
....

-మీ చిట్టి, పండు

6 comments:

'Padmarpita' said...

చాలా బాగుంది!

రసజ్ఞ said...

ఊహ బాగుందండీ! కాని చిత్రంలో జడ కొంచెం పొడవు ఉండుంటే బాగుండేదేమో అనిపించింది!

చిన్ని ఆశ said...

థ్యాంక్స్ పద్మార్పిత గారూ!

చిన్ని ఆశ said...

రసజ్ఞ గారూ! ధన్యవాదాలు.
కాస్త పొడుగుంటే ఇంకా బాగుండేదే, కానీ ఇలాక్కూడా మాకేంటో అందంగానే కనిపిస్తుందండీ...;)
మళ్ళీ ఒకసారి చూసి చెబ్దురూ!

రసజ్ఞ said...

హహహ మీ బొమ్మ నిజంగానే బాగుందండీ! కానీ నాకు మాత్రం పొడవు జడే ఇష్టం మీరేమనుకున్నా!

చిన్ని ఆశ said...

హ్మ్...ఎలాగండీ పెద్ద జడ వేస్తే, పాపం చిట్టి మళ్ళీ  నాకు లేదుగా  అని బిక్కమొహం పెడితే మేమేం చెయ్యము చెప్పండీ?

Post a Comment