© 2012 చిన్ని ఆశ, All Rights Reserved. Powered by Blogger.
RSS

అవగలవా సమస్తం...

© 2012 చిన్ని ఆశ, All Rights Reserved

"ప్రతి నిమిషం నా ప్రాణంగానే అనిపిస్తావు
నాలో ఇమిడిపోయి అన్నిటా అగుపిస్తావు

నువు లేవని కాలం ఆగక వెళ్ళి పోయినా
నువ్వున్నావని మనసు ఉప్పొంగిపోయినా

వెళ్ళిన కాలం వెనుక నువ్వొదలిన జ్ఞాపకాలే
ఉప్పొంగే మనసు ఎదుట నిన్నొదలని ఆశలే

ప్రాణంలో ప్రాణమై నువు నాలోనే ఉండగ
నువులేవని అనలేను ఈ గుండెకి తోడుగ

ఈ జన్మకి నాలో ప్రాణమైన ఓ నా నేస్తం
మరిన్ని జన్మలకీ అవగలవా నా సమస్తం ..."

-మీ చిట్టిపండు
....

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

8 comments:

పల్లా కొండల రావు said...

"ప్రాణంలో ప్రాణమై నువు నాలోనే ఉండగ
నువులేవని అనలేను ఈ గుండెకి తోడుగ"

మీ చేతుల్లోనే వుంది సమస్తం !
ఎన్ని జన్మలకైనా జారనివ్వకండి మస్తిష్కం !!

మీ కవితలు , దానికి తగ్గట్టు వేసే బొమ్మలు చూడడం అలవాటుగా మారుతోంది.

"చిన్ని ఆశ" said...

పల్లా కొండల రావు గారూ!
ధన్యవాదాలు, మా కవితలూ బొమ్మలూ మా మనసుతోనే చూసి మీ అభిప్రాయం చెప్తూ ఉన్నారు. మీ కామెంట్స్ నీ చదివి ఆలోచించటం మాకూ పరిపాటి అవుతోంది.

సుభ/subha said...

నీ చిత్రం చూడడం కోసం నా కన్నులలో ప్రాణాలన్నీ నింపుకొని ఎన్ని జన్మలకైనా నీ నేస్తాన్నే అవ్వగలను నేస్తం..

రసజ్ఞ said...

మీ చిత్రం, కవితా చిట్టి పండుల్లా చూడ ముచ్చటగా ఉంటాయి! చక్కని జంట!

జ్యోతిర్మయి said...

పదాల పొందిక చక్కాగా కుదిరింది..

"చిన్ని ఆశ" said...

@ సుభ గారూ!
"మా చిట్టి" తరపున తన మనసు తో మీ కామెంట్ కి ధన్యవాదాలు!

@ రసజ్ఞ గారూ!
చక్కని జంట! అని మీరు ముచ్చటగా మెచ్చుకోవటం మాకెంతో నచ్చింది...చాలా థ్యాంక్స్ అండీ!

@ జ్యోతిర్మయి గారూ!
ధన్యవాదాలండీ!

శశి కళ said...

వెళ్ళిన కాలం వెనుక నువ్వొదలిన జ్ఞాపకాలే
ఉప్పొంగే మనసు ఎదుట నిన్నొదలని ఆశలే
చాలా బాగా ఉంది ఈ భావం

"చిన్ని ఆశ" said...

@ శశి కళ గారూ,
ధన్యవాదాలండీ!

Post a Comment